![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1017 లో.. ఏంజిల్ ని కాలేజీకి రమ్మని వసుధార చెప్తుంది. నీకు మను గారి గురించి తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా అని అడుగగా.. నిన్న నువ్వే పరిచయం చేసావ్ కదా.. నాకు ఎలా తెలుస్తుందని ఏంజిల్ అంటుంది. నిన్న మను కూడా అనుపమ గారిని అత్తయ్య అంటున్నావ్? మీకు తెలుసా అని అడిగాడని చెప్పగానే అప్పుడే అక్కడికి మను వస్తాడు.
ఆ తర్వాత మీ గురించే మాట్లాడుకుంటున్నామని మనుతో ఏంజిల్ అంటుంది. మా అత్తయ్య మీకు ముందే తెలుసా? నిన్న నేను అత్తయ్య అని పిలిస్తే అలా పిలుస్తున్నారని అడిగారు కదా అని ఏంజిల్ అనగానే.. అలా అడిగినంత మాత్రాన తెలిసినట్టు కాదు కదా అని మను అంటాడు. అప్పుడే అక్కడికి శైలేంద్ర వస్తాడు. ఏంజిల్ ని చూసి.. నువ్వు కూడ ఉన్నావా? ఎవరెవరో వస్తున్నారు. ఒక్కోసారి ఇది DBST కాలేజీయేనా అని డౌట్ వస్తుందని శైలంద్ర అంటాడు. ఇక వసుధారతో శైలేంద్ర ఎప్పటిలాగే వాదనకి దిగుతాడు. నేను, రాజీవ్ కలిసి చేసే ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని శైలేంద్ర తన మనసులో అనుకుంటాడు. మరొకవైపు చక్రపాణి దగ్గరికి రాజీవ్ వచ్చి మాట్లాడుతాడు. నీ కూతురు కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. నువ్వైన ఓపించాలి కదా.మ రెండు సంవత్సరాల నుండి ఈ తాళిని పట్టుకొని తిరుగుతున్నానని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత రాజీవ్ వెళ్ళిపోతాడు. కాసేపటికి వసుధారకి చక్రపాణి ఫోన్ చేసి.. ఆ దుర్మార్గుడు రాజీవ్ వచ్చాడని అంటాడు. అప్పుడే మళ్ళీ రాజీవ్ వచ్చి ఫోన్ తీసుకొని వసుధారతో మాట్లాడతాడు.
ఆ తర్వాత ఏంజిల్ కార్ స్టార్ట్ అవ్వదు. అప్పుడే మను వచ్చి రిపేర్ చెయ్యాలా అని అడుగుతాడు. అవసరం లేదని అనుపమ అంటుంది. ఆ తర్వాత మీకు ఇప్పటికే పరిచయం ఉండి.. ఏదైనా గొడవ ఉందా అని ఏంజిల్ అడుగుతుంది. అలాంటివేం లేవని అనుపమ అంటుంది. అదంతా వసుధార చూస్తుంటుంది. ఆ తర్వాత రాజీవ్.. వసుధార, మను ఇద్దరు గల ఫోటో పోస్టర్ల కొత్త ప్రేమ ప్రయాణం అంటూ టైటిల్ ఆడ్ చేస్తారు. ఆ పోస్టర్లని కాలేజీ గోడలపై అతికిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |